రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం : అర్జున్

  •     బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్జున్  

మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తమ్మడబోయిన అర్జున్ అన్నారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని రవీందర్ నగర్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏకపక్షపాలన జరిగిందన్నారు.

తెలంగాణ అభివృద్ధి, హామీలను విస్మరించిన బీఆర్ఎస్ కు ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటుందన్నారు.  నీలగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా మరోసారి ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు భార్గవ రెడ్డి, జయమ్మ, నాగ, ఇంద్రయ్య, సునీల్, బాలకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.