ఇటీవల కాలంలో చాలా ఈ కామర్స్ సంస్థలు బ్లాక్ డే సేల్స్ నిర్వహిస్తున్నాయి. కస్టమర్లకు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. తమ కావాల్సిన వస్తువులను జనాలు ఎగబడి కొంటున్నారు. దీంతో వ్యాపార సంస్థలకు లాభాలు వస్తు్న్నాయి..కస్టమర్లు వారికి నచ్చిన వస్తువులను కొనుక్కుంటున్నారు. ఇదంతా బాగానే ఉంది.. అయితే బ్లాక్ ఫ్రైడే సేల్స్ అంటే ఏందీ..ఈ సేల్స్ ఎప్పటినుంచి జరుపుతున్నారు..బ్లాక్ ఫ్రైడే సేల్స్ వెనక ఉన్న కథాకమామిషు ఏందో తెలుసుకుందాం..
అమెరికాలో ప్రతి ఏడాది థాంక్స్ గివింగ్ డేను నవంబర్ నెలలో చివరి గురువారం జరుపుకుంటారు. ఆ తరువాత రోజు అనగా నాలుగో శుక్రవారం బ్లాక్ ఫ్రైడే జరుపు కుంటారు. ఈ ఏడాది కూడా నవంబర్29 న బ్లాక్ ఫ్రైడే జరుపుకొనేందుకు సిద్దమవుతున్నారు. అమెరికా ప్రజలు బ్లాక్ ఫ్రైడే జరుపుకోవడం వెనక ఓపెద్ద కథే ఉంది..
థాంక్స్ గివింగ్ డే రోజున తమకు నచ్చిన వారికి లేదా తమ కుటుంబ సభ్యులు, తెలిసిన వారు, ఇతరులెవరైనా సరే.. వారికి బహుమతులను ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుతుంటారు. తమ కోసం ఎదుటి వారు ఏదైనా పనిచేస్తే అందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారికి గిఫ్ట్‌లను ఇస్తారు. అయితే ఆ రోజు తరువాతి రోజును బ్లాక్ ఫ్రైడేగా జరుపుకుంటారు.
థాంక్స్ గివింగ్ డే రోజున వ్యాపార దుకాణాలు కళకళలాడుతాయి.కస్టమర్లను ఆకర్షించేందుకు వ్యాపారస్తులు అనేక ఆఫర్లు కూడా ప్రకటిస్తారు. ఈ రోజు వచ్చిన లాభ నష్టాలను బ్లాక్..రెడ్ ఎంట్రీలతో సూచిస్తారు. యూఎస్ మార్కెట్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం థాంక్స్ గివింగ్ డే తరువాత అన్నీ బ్లాక్ ఎంట్రీలే ఉంటాయి. అంటే.. పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయని అర్థం. అప్పటినుంచి బ్లాక్ ఫ్రైడేను నిర్వహిస్తున్నారు.
ALSO READ | చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!
యునైటెడ్ స్టేట్స్‌లో, బ్లాక్ ఫ్రైడే రోజు షాపులు బిజీగా ఉంటాయి. ఈ ఆఫర్లు నవంబర్ నెల నాలుగో వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉంటాయి. దీనినే అమెరికాలో సైబర్ వీక్ అంటారు.
అమెరికాలో బ్లాక్ ఫ్రైడేను ఎందుకు జరుపుకుంటారో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ..20వ శతాబ్దం మధ్యకాలంలో ఫిలడెల్ఫియాలో ప్రారంభమైందని తెలుస్తుంది. 1869 లో US గోల్డ్ మార్కెట్‌లో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని యూఎస్ మ్యాగ్జైన్ లో వచ్చిన కథనం ఆధారంగా తెలుస్తోంది. అప్పుడు గోల్డ్ వ్యాపారులు..సంక్షోభం నుంచి బయటపడేందుకు బ్లాక్ ఫ్రైడే పేరుతో ఆఫర్లను ప్రకటించారని తెలుస్తుంది. తరువాత కాల క్రమేణ ఇది అన్ని వ్యాపార దుకాణాలకు ఆనవాయితీగా మారింది.
ప్రస్తుతం చాలా కంపెనీలు తమ బ్లాక్ ఫ్రైడే డిస్కౌంట్‌లను ఆన్‌లైన్‌లో విస్తరించాయి, ఇంటర్నెట్ షాపర్‌లను ఆకర్షించడానికి సైబర్ వీక్ డీల్‌లను అందిస్తు న్నాయి. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే, చిన్న నుండి చిన్న..పెద్ద నుండి పెద్ద రిటైలర్లందరూ తమ కస్టమర్లకు థాంక్స్ గివింగ్ కోసం బ్లాక్ ఫ్రైడే అనే పదాన్ని ఉపయో గించడం ప్రారంభించారు. ఇవే కాకుండా ఇప్పుడు అమెరికా, యూరప్ లకే పరిమితం కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు చేరుకుంది.