బ్లాక్​హోల్​.. కొంచెం కొత్తగా

బ్లాక్​హోల్​.. కొంచెం కొత్తగా

బ్లాక్​హోల్​.. దాని దగ్గరకుపోయే దేన్నైనా చటుక్కున లాగేసుకుని గుటుక్కున మింగేస్తుంది. అలాంటి బ్లాక్​హోల్​ను ఎన్నెన్నో రకాలుగా సైంటిస్టులు వివరించారు. చూపించారు. ఇప్పుడు, దాన్నే కొంచెం కొత్తగా ప్రెజెంట్​ చేస్తోంది నాసా. మన చూపును ఎలా మాయ చేస్తుందో వివరించారు సైంటిస్టులు. వేర్వేరు ప్రాంతాల్లో గ్యాస్​ కదలికల వల్ల ఏర్పడే లైట్​తో బ్లాక్​హోల్​ డిస్క్​ ఓ రూపు అంటూ లేకుండా వెళుతుందట. కాంతి వేగంతో దూసుకెళ్లే గ్యాస్​ చుట్టూ అయస్కాంత క్షేత్రాల గాలులు ప్రభావం చూపించడం వల్ల దాని వెలుతురులో తేడాలు ఏర్పడతాయట. ఓ వైపు అమిత వేగంతో దూసుకెళ్లే గ్యాస్​, మరో వైపు మాత్రం తక్కువ వేగంతో తిరుగుతుందట. ఇక, ఎడమవైపు మాత్రం మస్తు కాంతిమంతంగా ఉండే బ్లాక్​హోల్​ డిస్క్​, కుడి వైపు మాత్రం కొంచెం చీకటిగా ఉంటుందంటున్నారు సైంటిస్టులు. దానికీ కారణముందని చెబుతున్నారు.

ఐన్​స్టీన్​ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం, డిస్క్​ చాలా వేగంతో మనవైపు వచ్చినట్టు ఉండడం వల్ల ఎక్కువ వెలుతురుతో కనిపిస్తుందట. అదే కుడివైపున మన నుంచి దూరంగా వెళుతున్నట్టు ఉండడం, వేగం తగ్గడం వల్ల కొంచెం తక్కువగా వెలుగుతుందట. అదే మనం ఆ డిస్క్​పైనగానీ, కిందగానీ చూసినప్పుడు ఆ లెక్కలన్నీ తారుమారవుతాయని అంటున్నారు. కారణం, ఆ డిస్క్​ మనవైపు వస్తున్నట్టుగానీ, మన నుంచి దూరంగా పోతున్నట్టుగానీ అనిపించకపోవడమేనని చెబుతున్నారు. బ్లాక్​హోల్​కు సరికొత్త రూపునిచ్చింది నాసా గొడ్డార్డ్​ స్పేస్​ఫ్లైట్​ సెంటర్​కు చెందిన జెరిమీ ష్నిట్​మాన్​.