భారీగా నల్లబెల్లం పట్టివేత

  •     3150 కిలోల నల్ల బెల్లం, బొలెరో, ఆటో సీజ్               

తుంగతుర్తి, వెలుగు : ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్​ఆధ్వర్యంలో సోమవారం మద్దిరాల మండలంలో దాడులు నిర్వహించారు. దాడుల్లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బొలెరో వాహనంతోపాటు ఆటోలో తరలిస్తున్న 63 బస్తాల నల్ల బెల్లం (3,150 కిలోల నల్ల బెల్లం ), పది లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్ల బెల్లం తరలిస్తున్న షేక్ సైదా వాహనాన్ని వదిలిపెట్టి పారిపోగా, అతడిపై కేసు నమోదు చేసి ఆటో, బొలెరో వాహనాన్ని సీజ్​చేశారు. 

స్థానిక ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో సీఐ రాకేశ్​వివరాలు వెల్లడించారు. నల్లబెల్లం విక్రయించేవారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. నల్ల బెల్లం కు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ దాడుల్లో ఎస్సై మల్లేశ్, సిబ్బంది శ్రీను, గోపాలరావు, ఆయూబ్, అఫ్సర్, శేఖర్ రెడ్డి,  బ్రహ్మం, రమేశ్, నాగరాజు పాల్గొన్నారు.