క్షుద్ర పూజల కలకలం.. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి

జగిత్యాల జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. పట్టణంలోని కరీంనగర్ రోడ్డు వైపు లేబర్ అడ్డా వద్ద గల మహాలక్ష్మి మెస్ ద్వారం షట్టర్ ముందు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి క్షుద్ర పూజలు చేసినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో కుంకుమ, పసుపు, నిమ్మకాయలు పేర్చి, కోడిని కోసి వదిలిపెట్టిన ఆనవాళ్లు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తెల్లవారుజామున మెస్ ఓపెన్ చేద్దామని వచ్చిన యజమాని అంజయ్య ఆ ప్రాంతంలో ఉన్న నిమ్మకాయలు, కోడిని చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. వెంటనే తేరుకున్న మెస్ యజమాని.. దగ్గర్లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మెస్ వద్ద ఇలా పసుపు, కుంకుమ... తదితర వస్తువులను చూసిన స్థానికులు సైతం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.