
Bloodbath: భారతీయ స్టాక్ మార్కెట్ల పనతానికి అతిపెద్ద కారణం అమెరికాతో పాటు గ్లోబల్ మార్కెట్లలో ట్రంప్ టారిఫ్స్ సృష్టించిన సునామీ. చాలా మంది నిపుణులు దీనిని దీనిని ఆర్థిక వ్యవస్థలపై అణుదాడిగా పేర్కొంటున్నారు. వాస్తవానికి ఈ పరిస్థితులు వస్తాయని అమెరికాలో మార్కెట్ అనలిస్ట్ జిమ్ క్రేమర్ హెచ్చరించారు. అయితే ఆయన ఈ హెచ్చరికకు 1987లో జరిగిన ఒక సంఘటనను ఉదహరించారు.
1987లో బ్లాక్ మండేరోజు ఏం జరిగింది..?
వాస్తవానికి 1987 ఆగస్టు 19న సోమవారం నాడు ఒక్కరోజులోనే అమెరికా స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీ డౌజోన్స్ ఏకంగా 22.6 శాతం పతనాన్ని నమోదు చేసింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో పెద్ద పతనానికి దారితీసింది. ఇది ఆర్థిక చరిత్రలో అతిపెద్ద నష్టాన్ని మిగిల్చింది. అదే రోజున మరో సూచీ ఎస్అండ్ పి 500 కూడా 30 శాతం పతనాన్ని నమోదు చేసింది. అప్పట్లో మార్కెట్ల పతనం నెలంతా కొనసాగటంతో మార్కెట్ సూచీ 20 శాతం మేర విలువను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులే తిరిగి రిపీట్ కావటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
19 లక్షల కోట్లు ఆవిరి..
ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపటంతో సోమవారం స్టాక్ మార్కెట్లు భయంకరమైన పతనాన్ని చూశాయి. ప్రస్తుతం 180 దేశాలపై ట్రంప్ వేసిన టారిఫ్స్ ప్రభావాన్ని చూపటంతో దీని ప్రతికూలతలపై ఆర్థిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్రంప్ ఇది కేవలం టీజర్ మాత్రమే భవిష్యత్తులో మరిన్ని టారిఫ్స్ ఉండనున్నట్లు పేర్కొన్న తర్వాత ఫార్మా రంగంలోని కంపెనీల షేర్లు సైతం పతనాన్ని చూడటం ప్రారంభించాయి. దీంతో నేడు ఇంట్రాడేలో భారతీయ పెట్టుబడిదారుల సంపద ఏకంగా రూ.20 లక్షల కోట్ల మేర ఆవిరైందని వెల్లడైంది. అయితే ఈ నష్టాలను రికవరీ చేసుకోవటానికి కనీసం మార్కెట్లు నెల నుంచి రెండు నెలల వరకు సమయం తీసుకోవచ్చని నిపుణులు గత అనుభవాల దృష్టిలో ఉంచుకుని చెబుతున్నారు. అయితే ట్రంప్ చర్యలు ఈ రికవరీ సమయాన్ని తగ్గించవచ్చని వారు చెబుతున్నారు.
►ALSO READ | Gold Rate: స్టాక్ మార్కెట్ల పతనంతో తగ్గిన గోల్డ్ రేట్లు.. భిన్నమైన పరిస్థితి ఎందుకు..?