- ట్రంప్ వ్యాఖ్యలపై కమల ఫైర్
వాషింగ్టన్: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్‌పై అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమోక్రటిక్ నామినీ కమలా హారిస్ స్పందించారు. అదే పాత సంప్రదాయా న్ని ట్రంప్ కొనసాగిస్తున్నారని, తన వ్యాఖ్యలతో నల్ల జాతీయులను ట్రంప్ అవమానించార ని కమల మండిపడ్డారు. నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించాలని నల్లజాతి మహిళలను ఆమె కోరారు.
బుధవారం హ్యూస్టన్ లోని సిగ్మా గామా రో సమావేశంలో (ఆఫ్రికన్ అమెరికన్ల అంతర్జాతీయ నాన్ ప్రాఫిక్ సంస్థ) కమల మాట్లాడారు. తనపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు.