నల్ల ఉప్పు బియ్యం ఏంటీ.. ఎక్కడ పండిస్తున్నారు.. వివాదం ఏంటీ..?

నల్ల ఉప్పు బియ్యం ఏంటీ.. ఎక్కడ పండిస్తున్నారు.. వివాదం ఏంటీ..?

దేశీయ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరగకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం బాస్మతీ యేతర బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఒక్క బాస్మతీ బియ్యం తప్పా మరే ఇతర తెల్ల బియ్యం ఎగుమతి చేయకూడదని నిషేధం విధించింది. నిషేధం విధించబడిన బాస్మతీ యేతర తెల్లబియ్యంలో నల్ల ఉప్పు బియ్యం కూడా ఉన్నాయి. అయితే దేశంలో అరుదుగా పండే ఈ బియ్యం ఎగుమతులపై కేంద్రం మనుసు మార్చుకుంది. కాలా నమక్ అని పిలువబడే ఈ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. దీంతో ఈ బియ్యం వార్తల్లోకి వచ్చాయి. ఇంతకీ నల్ల ఉప్పు బియ్యం ఏంటీ.. ఎక్కడ పండిస్తారు. వీటి ప్రత్యేక ఏందీ.. వివాదం ఏంటీ వంటి అనే విషయాలను తెలుసుకుందాం.. 
   
నల్ల ఉప్పు బియ్యం..ఈ బియ్యానికి మంచి డిమాండ్ ఉంది..ఈ బియ్యాన్ని ఉత్తరప్రదేశ్, నేపాల్లో మాత్రమే పండిస్తారు. ఈ బియ్యం మంచి సువాసనను కలిగి ఉంటాయి. ఒక ఇంట్లో వండితే చాలు.. వీధి అంతా దాని సువాసన విస్తరిస్తుంది. ఈ బియ్యాన్ని బుద్దుని కాలంలో పండించడం ప్రారంభించారట. సుమారు 2700 సంవత్సరాల చరిత్ర ఉన్న బియ్యం. అయితే ఇటీవల నల్ల ఉప్పు బియ్యం వార్తల్లోకెక్కింది. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు అనుమతించింది. దీంతో ఈ వీటిని పండించే రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

వెయ్యి మెట్రిక్ టన్నుల నల్ల ఉప్పు బియ్యం మాత్రమే ఎగుమతి చేయాలని అంతకు మించి ఎగుమతి చేయొద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది ఆరు ప్రదేశాలనుంచి ఎగుమతి చేయబడుతుంది.వారణాసి ఎయిర్ కార్గో, జవహర్ లాల్ నెహ్రూ కస్టమ్స్ హౌస్ మహారాష్ట్ర, కాండ్లా ఓడరేవు గుజరాత్, ఎల్సీఎస్ నేపాల్ గంజ్ రోడ్, ఎల్సీఎస్ సోనౌలీ, ఎల్సీఎస్ బద్నీని నుంచి ఎగుమతి చేయనున్నారు. 

నల్ల ఉప్పు బియ్యానికి ఎందుకు అంత ప్రాముఖ్యత 

నల్ల ఉప్పు బియ్యం చరిత్ర బుద్ధుని కాలం నాటింది. ఈ బియ్యం వాస్తవానికి ఉత్తరప్రదేశ్, నేపాల్ లోని టెరాయ్ ప్రాంతంలో పండిస్తారు. బ్లాక్ సాల్ట్ బియ్యానికి ఎంత సువాసన ఉంటుందంటే ఏ ఒక్క ఇంట్లో వండినా దాని సువాసన ఆ ప్రాంతమంతా చేరుతుంది. ఇది సాధారణంగా ఇతర రకాల వరితో పోల్చితే ఈ రకాన్ని పండించే రైతులు ఆర్థికంగా లాభాలు పొందుతారు. 

ఉత్తరప్రదేశ్ లోని సిద్దార్థనగర్ జిల్లాలోని గౌతమ బుద్దుని మహాప్రసాదంగా ప్రసిద్ధి చెందాయి ఈ నల్ల ఉప్పు బియ్యం.ఈ బియ్యం చరిత్ర 600 బీసి లేదా బుద్ద కాలం నాటిది. ఇది సిద్దార్థ నగర్, సంత్ కబీర్ నగర్, గోరఖ్ పూర్, మహారాజ్ గంజ్, గోండా, బస్తీ, ఖుషీనగర్ లలో ఎక్కువగా పండిస్తారు. 

నల్ల ఉప్పు బియ్యం ఎగుమతి 

నాణ్యత, మతపరమైన గుర్తింపు కారణంగా నల్ల ఉప్పు బియ్యం ఎగుమతి అర్హత కలిగి ఉన్నాయని ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనేజేషన్ లో చీఫ్ టెక్నికల్ అడ్వైజర్ గా ఉన్న ప్రొ.  చౌదరి అన్నారు. బౌద్ద మతాన్ని అనుసరించే కంబోడియా, భూటాణ్, జపాన్, తైవాన్, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్ వంటి దేశాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉందన్నారు ఆయన.