ఒడిశా రిజర్వ్‌లో అరుదైన నల్లపులి మృతి చెందింది. మయూర్‌భంజ్ జిల్లాలోని సిమిలిపాల్ నేషనల్ పార్క్ (STR)లోఅరుదైన నల్లపులి (సూడో-మెలనిస్టిక్) చనిపోయిందని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సుశీల్ కుమార్ పొప్లి తెలిపారు. ఏప్రిల్ 30న ఉదయం సిమిలిపాల్ సౌత్ డివిజన్ సిబ్బంది .. ll బీట్ ఏరియా, నవనా సౌత్ రేంజ్ సమీపంలో విగతజీవిగా ఉన్న నల్లపులిని గుర్తించారు.
దీనిని టి 27గా గుర్తించి మూడున్నర సంవత్సరాల వయస్సున్న మగ పులని అధికారులు నిర్దారించారు. పులి శరీరంపై గాయాలున్నాయి. నమూనాలను ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (OUAT), వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII)కి పంపారు. జాయింట్ టాస్క్ ఫోర్స్ (జెటిఎఫ్) సభ్యులు, ఫీల్డ్ డైరెక్టర్ డిడి సిమ్లిపాల్, వెటర్నరీ వైద్యులు , ఇతర సిబ్బంది సమక్షంలో పోస్ట్‌మార్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం నల్ల పులి మృతదేహాన్ని దహనం చేసినట్లు అధికారులు తెలిపారు.