
హార్మోనల్ ఇంబాలెన్స్, హైపర్ పిగ్మెంటేషన్ వల్ల చాలామందికి పెదాలు, వాటి చుట్టంతా నల్లగా అవుతుంది. మెలనిన్ ఎక్కువగా రిలీజ్ అవడమే దీనికి కారణం. అయితే, ఇది కవర్ చేయడానికో, పోగొట్టడానికో చాలా రకాల స్కిన్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాటి బదులు ఈ హోమ్ రెమిడీలతో నలుపుని తగ్గించుకోవచ్చు అంటోంది డాక్టర్ రింకీ కపూర్.
- నిమ్మకాయ కొల్లాజెన్‌ని పెంచుతుంది. ఇందులో నేచురల్ బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. తేనె లేదా పెరుగులో నిమ్మ రసాన్ని కలిపి నల్లగా ఉన్నచోట రాయాలి.
- శెనగ పిండిలో కొంచెం పసుపు కలిపి రాస్తే చర్మం మీది జిడ్డు పోతుంది.
- ఉల్లిగడ్డలో ఉన్న యాంటీఆక్సిడెంట్ ప్రాపర్టీలు చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. చర్మ కణాల్ని ఆరోగ్యంగా ఉంచి చర్మం ముడతలు పడకుండా చేస్తుంది. ఉల్లిగడ్డను మిక్సీ పట్టి దాన్ని పెదాలపై రాసినా ఫలితం ఉంటుంది.
- ఎండు బటానీలని మిక్సీ పట్టి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను పెదాలపై వారానికి రెండు సార్లు రాయాలి. ఈ ప్యాక్ మెలనిన్‌ని తగ్గిస్తుంది.
- నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ని తగ్గించడా నికి ఆలుగడ్డలో ఉన్న విటమిన్స్, మినరల్స్ సాయపడతాయి. ఆలుగడ్డ ముక్కల్ని నల్లగా ఉన్న దగ్గర కొద్దిసేపు రుద్ది పావుగంట తరువాత కడిగేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.