మూడు బాటల కాడ.. క్షుద్ర పూజల కలకలం

మూడు బాటల కాడ.. క్షుద్ర పూజల కలకలం

స్పేస్‌లోకి మనిషిని పంపే రోజులు వచ్చినా.. మూడనమ్మకాలు, క్షుద్రపూజలు మాత్రం జనాలను ఇంకా భయపెడుతున్నాయ్. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామ శివారులో క్షుద్ర పూజల కలకలం రేపాయి. ఊరి చివరిలో మూడు రోడ్డు కలిసే చోట పసుపు, కుంకుమ, కొబ్బరి కాయలతో కూడిన క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 

అందరూ అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. అయితే మారు మూల గ్రామాల్లో ఇలాంటివి ఏం కొత్త కాదు.. కానీ ఇటీవల కాలంలో పట్టణాల్లోకి కూడా ఇలాంటి క్షుద్రపూజల కల్చర్ వస్తోంది. జయపురం గ్రామ ప్రజలు, రైతులు బిక్కుబిక్కుమంటూ వారి పనులకు వెళ్తున్నారు. బ్రేతాత్మలు, క్షుద్ర పూజలు, నరదిష్ఠి అని కొందరు జనాల్ని మోసం చేస్తున్న దొంగబాబు బయటపడుతున్నా ప్రజలు మూడనమ్మకాలను ఇంకా నమ్ముతున్నారు.