మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేరుతో బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • రూ.2 లక్షల 50 వేలు వసూలు
  • సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసిన బాధితుడు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,వెలుగు: మంత్రి కేటీఆర్ పేరుతో ఓ వ్యక్తి తనను బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి రూ.2 లక్షల 50 వేలు వసూలు చేశాడని బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. లంగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్ కి చెందిన గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 6 నెలల క్రితం ఇమ్యూనిటీ థెరఫీ చేస్తానంటూ ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీన్ని చూసిన  ఓ వ్యక్తి గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. తాను మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మనిషినని, తన పేరు కేశవులు అని చెప్పాడు. ఇమ్యూనిటీ థెరపీ చేయడం ఇల్లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటూ గోపాల్ నాయక్ ను బెదిరించాడు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇలా పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినందుకు పోలీసులకు కంప్లయింట్ చేస్తానని బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. 6  నెలలుగా  రూ.2 లక్షల 50 వేలను గోపాల్ నాయక్ ను నుంచి సదరు వ్యక్తి వసూలు చేశాడు. మళ్లీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు గోపాల్ నాయక్ బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.