న్యూఢిల్లీ: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్‌స్టోన్ భారతీయ స్నాక్స్ కంపెనీ హల్దీరామ్‌లో వాటాను పొందేందుకు యాజమాన్య కుటుంబంతో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ రూ.70 వేల కోట్ల వరకు ఉంటుంది. బ్లాక్స్టోన్తోపాటు కన్సార్టియం భాగస్వాములు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, బ్లాక్‌స్టోన్ గ్లోబల్ ఫండ్‌లకు మద్దతిచ్చే సింగపూర్ జీఐసీతో కలిసి ఢిల్లీ, నాగ్‌పూర్‌లో ఉన్న అగర్వాల్ కుటుంబ సభ్యులతో చాలా నెలలుగా చర్చలు జరుపుతున్నాయి.
అయితే, వ్యాపారం వాల్యుయేషన్‌కు సంబంధించిన విభేదాల వల్ల చర్చలు కొంతకాలం నిలిచిపోయాయి. గత కొన్ని వారాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. బ్లాక్‌స్టోన్ కన్సార్టియం హల్దీరామ్స్‌లో 76 శాతం వరకు వాటాను పొందాలని భావిస్తున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యుల్లో కొందరు కేవలం 51 శాతం వాటాను మాత్రమే విక్రయించాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుత చర్చల ప్రకారం 74 శాతానికి దగ్గరగా వాటాను విక్రయించే అవకాశం ఉంది. ఐపీఓకు వెళ్లాలనే ప్రపోజల్‌ను కూడా హల్దీరామ్ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.