న్యూఢిల్లీ: బ్లాక్‌స్టోన్‌కు చెందిన డైమండ్ గ్రేడింగ్ కంపెనీ ఇంటర్నేషనల్ జెమ్మలాజికల్ ఇన్‌స్టిట్యూట్ (ఇండియా) ఐపీఓ ద్వారా రూ.4 వేల కోట్లు సేకరించడానికి రెడీ అయ్యింది. ఐపీఓ ప్రిలిమినరీ పేపర్లను సెబీ వద్ద ఫైల్ చేసింది. ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం ద్వారా రూ.1,250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) కింద మరో రూ.2,750 కోట్లను సేకరించాలని కంపెనీ చూస్తోంది. ఓఎఫ్‌ఎస్ కింద ప్రమోటర్ బీసీపీ ఏషియా2 టాప్‌కో పీటీఈ లిమిటెడ్ షేర్లను అమ్మనుంది. ఐపీఓ ద్వారా సేకరించిన ఫండ్స్‌ను ఐజీఐ బెల్జియం గ్రూప్, ఐజీఐ నెదర్లాండ్స్ గ్రూప్‌ను కొనుగోలు చేయడానికి వాడనున్నారు. నేచురల్ డైమండ్స్, ల్యాబ్‌లలో తయారైన డైమండ్స్, కలర్డ్ స్టోన్స్‌కు సర్టిఫికెట్‌ను కంపెనీ ఇష్యూ చేస్తుంది.
ఈకాస్ ఐపీఓ ఓపెన్..
మొబిలిటీ సర్వీస్‌లను అందించే ఈకాస్ (ఇండియా) మొబిలిటీ అండ్ హాస్పిటాలిటీ ఐపీఓలో ఒక్కో షేరుని రూ.318–334 ప్రైస్ రేంజ్‌లో అమ్మనుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.601 కోట్లు సేకరించాలని కంపెనీ చూస్తోంది. కంపెనీ ఐపీఓ ఈ నెల 28 న ఓపెనై 30 న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 27 న అందుబాటులో ఉంటుంది. ఓఎఫ్‌ఎస్ కింద 1.8 కోట్ల షేర్లను అమ్మి రూ.601 కోట్లు సేకరించాలని కంపెనీ ప్రమోటర్లు రాజేష్ లుంబా, ఆదిత్య లుంబా చూస్తున్నారు. ఫ్రెష్‌గా షేర్లను ఇష్యూ చేయడం లేదు.