
ఉదయాన్నే బయటికెళ్లి టిఫిన్ చేసే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. బ్యాచిలర్స్ దగ్గర నుంచి.. ఇంట్లో వండుకోవడానికి ఇష్టపడని చాలామంది బయట టిఫిన్ సెంటర్స్ కి వెళ్లి తింటుంటారు. అయితే.. అక్కడ శుచిశుభ్రతా పాటిస్తే ఓకే.. లేదంటే మన ఆరోగ్యానికే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో హోటళ్లు రెస్టారెంట్లలో నిర్లక్ష్యం అడుగడుగునా బయటపడుతోంది.ఎక్కువ లాభం కోసం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగాతూర్పు గోదావరి జిల్లాలో ఓ హోటల్ నిర్లక్ష్యం బయటపడింది. బజ్జీ తిందామని వెళ్లిన కస్టమర్ కి బజ్జీలో బ్లేడ్ కనిపించటంతో అవాక్కయ్యాడు.
తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం యర్నగూడెంలో టిఫిన్ పార్శిల్ తీసుకున్నాడు ఓ వ్యక్తి.. ఇంటికెళ్లి పార్శిల్ ఓపెన్ చేయగానే.. అవాక్కయ్యాడు సదరు వ్యక్తి. బజ్జీలో బ్లేడ్ కనిపించటంతో కస్టమర్ కి దిమ్మతిరిగిపోయింది. హోటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తన ప్రాణానికి ప్రమాదం వచ్చి ఉండేదని వాపోతున్నాడు బాధితుడు.
►ALSO READ | తిరుమల కొండపై బెల్ట్ షాపు : గోవిందా ఏందయ్యా ఇది..!
గ్రామంలోని పలు హోటళ్ళలో నాణ్యత పరిశుభ్రత సరిగా పాటించడం లేదని.. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న హోటల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు స్థానికులు.