
పద్మారావునగర్, వెలుగు: పద్మారావునగర్లోని స్కై ఫౌండేషన్ న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి పేదలకు, ఫుట్ పాత్పై ఉంటున్న యాచకులకు దుప్పట్లు పంచింది. ఫౌండేషన్ సభ్యులు సిటీ మొత్తం తిరుగుతూ ఫుట్ పాత్పై నిద్రపోతున్న అనాథలు, యాచకులకు దుప్పట్లు అందజేశారు. ఎలాంటి ఆదరణ లేకుండా దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నవారికి ప్రభుత్వం ఆశ్రయంతోపాటు, పని కల్పించాలని ఫౌండేషన్ ఆర్గనైజర్లు కోరుతున్నారు.