మైలార్‌దేవ్‌పల్లిలో పేలుడు.. పూజారికి తీవ్ర గాయాలు

నగర శివారు ప్రాంతమైన మైలార్‌దేవ్‌పల్లిలో పేలుడు కలకలం రేగింది. లక్ష్మీగూడ రోడ్‌ పరిధిలోని ప్రజాప్రతి శ్రీశ్రీ యాదేమాత ఆలయం ప్రాంగణంలో చెత్తను తొలగిస్తుండగా.. పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆలయ పూజారి సుగుణారామ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. హుతీహుటీన ఆయనను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న చేరుకున్న ఘటన స్థలానికి చేరుకొని పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 

ALSO READ | అసలేం జరిగింది: మియాపూర్ లో అదృశ్యమైన అమ్మాయి మృతదేహం లభ్యం..