జన్మహక్కు పౌరసత్వం(Birth Right Citizenship)పై అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర్వుపై అమెరికా కోర్టు స్టే ఇచ్చింది. ట్రంప్ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని జిల్లా న్యాయమూర్తి తాత్కాలికంగా నిరోధించారు. కోర్టు నిర్ణయం వేలాది మంది వలసదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది. అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న జన్మహక్కు పౌరసత్వం హక్కును తగ్గించే అధ్యక్షుడి కార్యనిర్వాహక ఉత్తర్వును అమలు చేయకుండా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి గురువారం(జనవరి 24) స్టే ఇచ్చారు. ఈ సందర్భంగా కఠినంగా రాజ్యాంగ విరుద్ధం అని వెల్లడించారు.
వాషింగ్టన్, అరిజోనా, ఇల్లినాయిస్ , ఒరెగాన్ రాష్ట్రాల అభ్యర్థన మేరకు US సీటెల్ జిల్లా న్యాయమూర్తి జాన్ కోగ్‌నూర్ తాత్కాలిక నిషేధ ఉత్తర్వును జారీ చేశారు. సోమవారం రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే కఠిమైన వలస విధానాలపై సంతకం చేశారు. దీంతో దీంతో ఎన్నోఏళ్లుగా ఉన్న జన్మహక్కు పౌరసత్వం రద్దు చేయబడింది. ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని దాదాపు 22 రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి.
మరోవైపు జన్మహక్కు పౌరసత్వంపై అమెరికాలో ఉన్న భారతీయుల్లో ఆందోళన మొదలైంది.. కొందరైతే నెలలు నిండకుండా పిల్లలను కనేందుకు సిద్ధమయ్యారు. ఒక్క భారతీయులే కాదువివిధ దేశాలకు చెందిన అమెరికాలో సెటిల్ అయిన వారంతా ట్రంప్ నిర్ణయంలో ఇబ్బందుల్లో పడ్డారు. అయితే సీటెల్ జిల్లా కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు..ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. పైకోర్టు అప్పీల్ చేస్తామని ప్రకటించారు.
జన్మహక్కు పౌరసత్వం: ట్రంప్ ఆదేశం ఏమిటి?
ట్రంప్ ఆదేశం ప్రకారం..ఫిబ్రవరి19 తర్వాత అమెరికాలో పుట్టిన వారి పేరెంట్స్ అమెరికన్ పౌరులు లేదా చట్టబద్దమైన శాశ్వత నివాసితులు కాని పక్షంలో వారికి పౌరసత్వం ఉండదు. దీంతో సామాజిక భద్రత, ప్రభుత్వ బెనిఫిట్స్ అందవు.
జన్మహక్కు పౌరసత్వం..
1868లో 14వ సవరణ ప్రకారం జన్మహక్కు పౌరసత్వం అమలులో ఉంది. అమెరికాలో అంతర్యద్దం తర్వాత ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వాన్నిస్తూ ఈ చట్టం ఆమోదించారు. దీని ప్రకారం.. యూనైటెడ్ స్టేట్స్ లో జన్మించిన వ్యక్తులు లేదా అక్కడుండేవారు అమెరికా పౌరులే. అయితే ప్రస్తుత ట్రంప్ ఉత్వర్వుల ప్రకారం.. పౌరులు కానీ వారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం వర్తించదు.
ట్రంప్ ఆర్డర్ గనక అమలు అయితే.. ఏటా లక్షా 50వేల మంది నవజాత శిశువులు పౌరసత్వా్న్ని కోల్పోతారు.
జన్మహక్కు పౌరసత్వం నిషేధిస్తూ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేసి మరుక్షణం నుంచి అమెరికా వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ట్రంప్ ఉత్తర్వుకు వ్యతిరేకంగా కోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. పౌరసంఘాలు, అమెరికాలోని 22 రాష్ట్రాలకు చెందిన డెమోక్రాటిక్ అటార్నీ జనరల్ లు ఈ పిటిషన్లు చేశారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ పౌరసత్వ నిబంధనను ట్రంప్ ఆదేశం ఉల్లంఘించిందని అది అమెరికాలో జన్మించిన ఎవరైనా పౌరులేనని రాష్ట్రాలు వాదించాయి.