Andhra News : మదనపల్లె RDO ఆఫీసు బూడిదైంది..: విచారణకు సీఎం ఆదేశం

ఏపీ స్టేట్ చిత్తూరు జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ మంటలకు బూడిద అయ్యింది. బిల్డింగ్ మొత్తం మంటల్లో బూడిదగా మారింది. ఫైర్ ఇంజిన్లు సైతం మంటలను అదుపు చేయలేని పరిస్థితిలో మంటలు ఎగిసిపడ్డాయి. 2024, జూలై 22వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని ప్రాథమికంగా అధికారులు వెల్లడించినా.. దీనిపై సీఎం చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కుట్ర కోణం ఉండొచ్చనే ఉద్దేశంతో.. డీజీపీ రేంజ్ లో విచారణకు ఆదేశించారు సీఎం చంద్రబాబు.

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదాన్ని స్వయంగా విచారించాలని.. వెంటనే మదనపల్లె వెళ్లాలని డీజీపీ, సీఐడీ చీఫ్ ను ఆదేశించారు సీఎం చంద్రబాబు. స్వయంగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు చంద్రబాబు.

మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ అన్నీ కాలిపోవటం వెనక కుట్ర కోణం ఉండొచ్చని.. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు రాకుండా.. ఫైల్స్ అన్నీ మాయం చేయటానికి.. ఎవరైనా కుట్ర పూరితంగా మంటలు పెట్టి ఉండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ.. నిజానిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీ, సీఐడీ చీఫ్ ను ఆదేశించారు చంద్రబాబు.