జగిత్యాల టౌన్, వెలుగు: అయోధ్యలో రాముని పూజలో ఉపయోగించిన అక్షింతలు, రామాలయ చిత్రపటం గురువారం జగిత్యాలకు చేరాయి. విద్యానగర్ లోని సీతారామ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజు, లక్ష్మి, మహేశ్, బిట్టు, అరుణ్ కుమార్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట, వెలుగు : అయోధ్య రాములవారి అక్షింతలు, ఉత్సవ విగ్రహాలు ఎల్లారెడ్డిపేటకు గురువారం చేరకున్నాయి. స్థానిక అయ్యప్ప ఆలయం నుంచి శోభాయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, సింగిల్ విండో డైరక్టర్ వెంకట నర్సింహారెడ్డి, దుంపెన రమేశ్, ఈశ్వర్, ముత్యా ప్రభాకర్ రెడ్డి, మేగి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.