నిజామాబాద్అర్బన్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రైతుబంధు పథకంపై పూర్తిస్తాయి విచారణ జరిపించాలని బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ దండి వెంకటి డిమాండ్ చేశారు. ఆదివారం సిటీలోని పార్టీ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో సమావేశంలో మాట్లాడారు.
రైతుబంధు ముసుగులో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్కు చెందిన లీడర్లు, చివరకు ప్రభుత్వ అధికారులు సైతం విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ప్రభుత్వం రైతుబంధు పథకంతో పాటు లబ్ధిదారుల ఎంపికపై సమగ్ర విచారణ జరపాలని, ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.