అంధుల రెస్టారెంట్: చీకట్లో పసందైన విందు

అంధుల రెస్టారెంట్: చీకట్లో పసందైన విందు

కారు చీకట్లో కమ్మని రుచుల విందు. కేవలంమాటలు, వాసన, స్పర్శ తోనే భోజనం. అమ్మోతలుచుకుంటేనే కొంచెం థ్రిల్ గా, కాస్తభయంగా అనిపిస్తుంది. అంధుల ప్రపంచంఅంతా చీకటిగానే ఉంటుంది కదా. అయినా వారు తమ జీవితాలను కొనసాగిస్తున్నారు.మనం కూడా వారి ప్రపంచంలోకి వెళ్లి ఎలా అనుభవిస్తున్నారో స్వయంగా ఫీలయ్యే అవకా శాన్ని కల్పిస్తుంది ఓ రెస్టా రెం ట్. అక్కడ పనిచేసే సిబ్బంది అంతా అంధులే. వారే అక్కడ మనకు గైడ్ లు, సర్వర్ లు, మిత్రులు. అదే హైదరాబాద్ బేగంపేట్ హరితప్లాజా హోటల్ లోని డైలాగ్ ఇన్ ద డార్క్ రెస్టారెంట్. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

అంధత్వంపై అవగాహన కోసం….

ఎన్నో రకాల థీమ్డ్ రెస్టారెం ట్ సిటీ జనాలను అలరిస్తున్నాయి. వాటికి భిన్నం గా ఉంటుంది’డైలాగ్ ఇన్ ది డార్క్ రెస్టా రెం ట్’. – అంధత్వం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్వీ కృష్ణన్ ఆధ్వర్యంలో ఏర్పాటైనది. డైలాగ్ ఇన్ ద డార్క్ సంస్థ, తెలంగాణ టూరిజం సంయుక్తాధ్వర్యం లో బేగంపేట్ హరితప్లాజా హోటల్ లో అంధుల ప్రత్యేక రెస్టారెంట్ ఇది. సిటీలో ఏర్పాటైన రెండో రెస్టారెంట్. మొదట మాదాపూర్‌‌‌‌లోని ఇనార్బిట్ మాల్ లో ఏర్పాటు చేశారు. మరింత చేరువ కావాలనే ఆలోచనతో గత నెల 23న రెస్టారెంట్ ను ప్రారంభించారు.

అద్భుతమైన అనుభూతి….

టూరిజం ప్లాజా మూడో అంతస్తులో ఉంటుంది. రెస్టా రెం ట్ లోకి వెళ్లడానికి ముందు బయట ఒక రిసెప్షన్, దాన్ని ఆనుకుని కొన్ని లాకర్స్ ఉంటాయి. అక్కడ ఉండే రిసెప్షనిస్ట్ కూడా ఫిజికల్లి డిజాబుల్డ్ పర్సనే.కస్టమర్లు వెజ్ .. నాన్ వెజ్ మెనూనా? తెలుసుకుని ఫోన్ లో కిచెన్ లో చెఫ్ లకు చెబుతారు. ఆ తర్వాత కస్టమర్ల వద్ద ఉన్న బ్యాగ్స్, వాచెస్,ఫోన్స్ పెట్టుకునేం దుకు ఒక లాకర్ ఇస్తారు. అనంతరం రిసెప్షనిస్ట్ లోపలికి తీసుకెళ్లి ఒక వ్యక్తికి అప్పగించి వస్తాడు. టేబుల్స్ వద్ద కూర్చోబెడతారు. ఒక్కసారి లోపలికి ఎంటర్ అయ్యాక మొత్తం చీకటి కమ్మేస్తుంది. ఏమీ కనిపించదు.టేబుల్ వద్దకు వెళ్లాక ఫుడ్ వచ్చేలోపు కొన్ని రకాల గేమ్స్ మనతో ఆడిస్తారు. వాటి వల్ల చూపులేకున్నా మిగిలిన జ్ఞానేంద్రియాలతో ఎలా జీవించవచ్చనేది తెలుస్తుంది. ఫుడ్ అందుబాటులో ఉంచి ఎక్కడ ఏ ఐటెమ్ ఉందో తెలుసుకోమని చెబుతారు. ఫుడ్ తిన్నాక ఫీలింగ్‌‌‌‌ను ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోమని అడుగుతారు. నిజంగా డార్క్ రెస్టా రెం ట్ ఒక అందమైన అనుభూతి కలిగిస్తుంది.

నోరూరిం చే ఫుడ్…

అంధుల రెస్టా రెం ట్ అంటే ఫుడ్ ఎలాఉంటుందో అనే సందేహమే అక్కర్లేదు.చెఫ్ లందరూ మాములువారే. సర్వ్ చేసేవారు మాత్రమే అంధులు. వెజ్,నాన్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి. త్రీ కోర్స్ మీల్ ఉంటుంది. అంటే ప్రీ ప్లేటెడ్ మీల్ అన్నమాట. దీన్ని సప్రైజ్ మీల్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అందులో ఏముందో సెలెక్ట్ చేసుకు ని తినడానికి వీలుండదు. ఎక్కడ ఏముందో వెతుక్కు ని తినాలి కాబట్టి సర్పైజ్ మీల్. వీటిలో మెయిన్ కోర్స్, స్టా రస్్ట , డిజర్స్ట్ ఉంటాయి. బయట రెస్టా రెం ట్లలో ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా ఇక్కడ రుచులు ఉంటాయి. ఈ ప్రి ప్లేటెడ్ మీల్ రెగ్యులర్ ప్రైస్ 599+టాక్సెస్. అయితే కొత్తగా స్టా ర్ట్ చేసినందు వల్ల 499+ పన్నులు గా పెట్టారు.