హైదరాబాదీలు ఎంజాయ్.. బ్లింకిట్ కొత్త సేవలు.. 10 నిమిషాల్లో యాపిల్ ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ

హైదరాబాదీలు ఎంజాయ్.. బ్లింకిట్ కొత్త సేవలు.. 10 నిమిషాల్లో యాపిల్ ప్రొడక్ట్స్ హోమ్ డెలివరీ

అగ్రశ్రేణి క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన బ్లింకిట్ రోజురోజుకూ తమ వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఈమధ్యనే అంబులెన్స్, స్కోడా కార్లను డెలివరీ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యపరిచిన న బ్లింకిట్.. తాజాగా యాపిల్ ప్రొడక్ట్స్ సేవల్లోకి దిగింది. 

తమ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఆపిల్ ఉత్పత్తులు, యాక్సిసరీస్ వినియోగదారులకు 10 నిమిషాల్లోనే డెలివరీ చేసేందుకు సిద్ధమైందని బ్లింకిట్ సీఈవో ఎక్స్(X) వేదికగా ప్రకటించారు.  

ALSO READ : ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్ న్యూస్.. హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ తగ్గించే యోచనలో కేంద్రం..?

బ్లింకిట్ సేవల్లో మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్, ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ వాచ్ వంటి వస్తువులు ఉన్నాయి. ఈ ఆపిల్ ఉత్పత్తులను కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయగలమని బ్లింకిట్ CEO అల్బిందర్ దిండ్సా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ సేవలు మొదట ఢిల్లీ ఎన్సీఆర్ పరిధి, ముంబై, హైదరాబాద్, పూణే, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, జైపూర్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో మొదలు కానున్నాయి.