రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన ఆవుల అనంతయ్యకు చెందిన చామంతి తోటలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేశారు. గురువారం పొలానికి వెళ్లిన అనంతయ్యకు ‘మొక్కలు పీకేసి ఇస్తరాకులో పసుపు, కుంకుమతో కలిపిన అన్నం
పిండితో చేసిన బొమ్మకు పుల్లలు గుచ్చిన ఆనవాళ్లు’ కనిపించడంతో పోలీసులకు చెప్పాడు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇది ఎవరు చేసి ఉంటారా అని ఆరా తీస్తున్నారు.
- చేవెళ్ల, వెలుగు