కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అడ్వకేట్ సొసైటీ హాల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి ఎస్‌ఎన్.శ్రీదేవి మాట్లాడుతూ రక్తదానం వల్ల విలువైన ప్రాణాలను కాపాడవచ్చని చెప్పారు.
కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి, అడిషనల్ జూనియర్ జడ్జి దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్‌గౌడ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం. రాజన్న, డీఎస్పీ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.