
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అంబేద్కర్ జయంతి సందర్భంగా శనివారం మాల ఉద్యోగుల సంఘం, సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 70 మంది యువకులు రక్తదానం చేశారు. గర్భిణులు, చిన్నారులు, ఆపరేషన్లు చేయించుకొనే వారికి అవసరమైన రక్తం సమకూర్చేందుకు శిబిరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. రక్తదాతలకు డీఎంహెచ్వో సుధాకర్ లాల్ ప్రశంసాపత్రాలు అందజేశారు. మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కూన గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి వెంకటపతి, ప్రభాకర్, కోటేశ్వర్, సామ రమేశ్, ఈశ్వర్, కృష్ణయ్య, సింగోటం, నరసింహ పాల్గొన్నారు.