హాలియా, వెలుగు: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆధ్వర్యంలో హాలియాలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ మర్ల చంద్రారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, జటావత్ రవి నాయక్, పట్టణ అధ్యక్షుడు వడ్డే సతీశ్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్లు మెరుగు రామలింగయ్య, ఆడెపు రామలింయ్య, కౌన్సిలర్ నల్లబోతు వెంకటయ్య, సురభి రాంబాబు, మాతంగి కాషయ్య, బందిలి సైదులు, సైదా చారి, రాయనబోయిన రామలింగయ్య పాల్గొన్నారు.