గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రక్తదానం

గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రక్తదానం

సంగారెడ్డి టౌన్, వెలుగు : ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ 50 ఏళ్లు పూర్తి చేసుకుని గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం సంగారెడ్డిలోని కెమిస్ట్రీ భవన్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఈర్ణ కృష్ణ మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న మరో వ్యక్తికి ప్రాణదానం చేయవచ్చన్నారు. 

కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు రమేశ్, అనుమల సంతోష్ కుమార్,  దశరథ్, శశికాంత్, చందన్, సతీశ్, ఈశ్వర్, రఘుపతిరావు,  కృష్ణ యాదవ్,  జ్ఞానేశ్వర్, చంద్రమోహన్, సత్యనారాయణ, సుకృత్,  శ్రీనివాసచారి పాల్గొన్నారు. రాము, మధు, రిషిత్, మహేశ్, దుర్గ ప్రసాద్, శివ రక్తదానం చేశారు.