
రంజిత్ రామ్, అప్సర రాణి జంటగా ఎంజిఆర్ దర్శకత్వంలో హరీష్ కె నిర్మిస్తున్న చిత్రం ‘బ్లడ్ రోజెస్’. షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బుధవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. రంజిత్ రామ్ మాట్లాడుతూ ‘కర్నాటకలో నేను కొన్ని సినిమాలు చేశాను.
మంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. అప్సర రాణి మాట్లాడుతూ ‘డిఫరెంట్ కథతో రాబోతున్న కొత్త జానర్ ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది. డైరెక్టర్ ఎంజిఆర్ మాట్లాడుతూ ‘ఇందులో రంజిత్ రామ్, అప్సర రాణి చక్కగా నటించారు, శ్రీలు, క్రాంతి కిల్లి ఇంపార్టెన్స్ రోల్స్‌లో కనిపించబోతున్నారు.
ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ చేస్తుంది’ అని అన్నాడు. అవుట్‌పుట్ బాగా వచ్చిందని త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తామని నిర్మాత హరీష్ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.