ఈ చికిత్స చేయించుకుంటే..ఎప్పటికీ ముసలోళ్లుకారా! ..బ్రయాన్ జాన్సన్ ప్లాస్మా రీప్లేస్ మెంట్

ఈ చికిత్స చేయించుకుంటే..ఎప్పటికీ ముసలోళ్లుకారా! ..బ్రయాన్ జాన్సన్ ప్లాస్మా రీప్లేస్ మెంట్

బ్రయాన్ జాన్సన్..టెక్ వ్యవస్థాపకుడు..బిలియనీర్..ఏదో కొత్త అంశంతో వార్తల్లో ఉంటారు. యాంటీ ఏజింగ్ మెథడ్స్ వినియోగించడంలో 47యేళ్ళ బ్రయాన్ జాన్సన్ రికార్డ్ అన్నమాట. ఇతను వయసు రీత్యా వచ్చే మార్పులను, మీద పడుతున్న వృద్ధాప్య లక్షణాలను దగ్గరకు చేరకుండా కొత్త కొత్త వైద్య విధానాలను వాడు తుం టారు. అందులో భాగంగా ఇటీవల టోటల్ ప్లాస్మా ఏక్ఛ్సేంజ్(TPE) ని చేయించుకున్నారు. 

యాంటీ ఏజింగ్ మెథడ్స్ వినియోగం ద్వారా తాను కొంతవరకు లక్ష్యాన్ని చేరుకున్నట్లు తెలిపారు. జాన్సన్ మొత్తం ఆరుసార్లు ఈ చికిత్స చేయించుకున్నారు.   ‘‘ నేను నా శరీరం నుంచి మొత్తం ప్లాస్మాను తీయించుకున్నాను..అల్బుమిన్ ద్వారా రీప్లేస్ చేయించాను అని ట్వీట్ చేశారు. 

TPE ద్వారా జాన్సన్ తన శరీరంలోని ప్లాస్మా మొత్తాన్ని తీసేసి దాని స్థానంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ ను భర్తీ చేయించుకున్నారు. టీపీఇ సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ విధానం ద్వారా తాను అనుకున్న లక్ష్యాలను చేరుకుంటున్నట్లు తెలిపారు. 

Also Read :- గుడ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

ఇంతకుముందు కూడా జాన్సన్ చాలా రకాల యాంటీ ఏజింగ్ మెథడ్స్ చేయించుకున్నాడు. 2023లో  జాన్సన్ తన యుక్త వయసులో కొడుకుతో రక్తమార్పిడి చేయించుకున్నారు. ఇది జీవన శక్తిని పెంచే ప్రయోగాల్లో ఒకటి. ఈ ప్రయత్నం తన కనుబొమ్మలను పెంచింది. ఈ చికిత్స లక్ష్యాలు శరీరం నుంచి విషాన్ని తొలగించడం అని జాన్సన్ ఒక ట్వీట్ లో రాశారు. 

టోటల్ ప్లాస్మా ఏక్ఛ్సేంజ్(TPE)  అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ , రక్త సంబంధిత సమస్యలను నయం చేసేందుకు వినియోగించే ప్రక్రియ. ఈ విధానంలో ప్లాస్మా, అల్బుబిన్ వంటి రీప్లేస్ మెంట్ ఫ్లూయిడ్ తో పాటు ఎర్ర రక్తకణాలను తిరిగి నింపడం జరుగుతుంది. ఈ విధానంలో మొత్తం ఆరు సార్లు చికిత్స తీసుకున్నారు జాన్సన్. బ్రయాన్ జాన్సన్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.