
బ్లాక్ ఫ్రైడే.. ఇవాళ (ఫిబ్రవరి 28) స్టాక్ మార్కెట్లో వినిపిస్తున్న పదం ఇది. ఫిబ్రవరి చివరి సెషన్ అయిన ఈ రోజు మార్కెట్లలో రక్తపాతం కనిపించింది. స్మా్ల్, మిడ్, లార్జ్ క్యాప్ అంటూ తేడా లేకుండా అన్ని ఇండెక్స్ లు ఘోరంగా కుప్పకూలాయి. మార్కెట్లో ఉన్న అన్ని 13 సెక్టోరియల్ ఇండెక్స్ లు ఇవాళ రెడ్ లో ముగిశాయి. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు ఏకంగా 2శాతం కుప్పకూలాయి. ఒకే సెషన్ లో ఇండెక్స్ 2 శాతం పతనం అంటే చాలా ఘోరమైన ఫాల్ అని చెప్పవచ్చు.
నిఫ్టీ 418 పాయింట్లు పడిపోయి 22,126 దగ్గర స్థిరపడింది. అదే సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1420 పాయింట్లు పతనం అవ్వడంతో 73,192 స్థాయికి చేరుకుంది. మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీల్లో కేవలం 400 స్టాక్స్ మాత్రమే అడ్వాన్స్ ఉండగా, 2,221 స్టాక్స్ ఇవాళ డిక్లైన్ అయ్యాయంటే మార్కెట్ ఈ రోజు ఎంత ఘోరంగా పతనం అయ్యిందో ఊహించవచ్చు. మార్కెట్లు వరుసగా 5 నెలలుగా నష్టాల్లో ముగియటం గత 29 ఏళ్లలో ఇదే తొలిసారి.
ఇక ఇండియన్ రూపీ డాలర్ తో పోల్చితే 0.2 శాతం పడిపోయింది. యూఎస్ డాలర్ తో పోల్చితే 87.4 దగ్గర క్లోజ్ అయ్యింది.
ఇవాళ్టి మార్కెట్ క్రాష్కు కారణాలు:
యూఎస్ ఎకానమీ స్లోడౌన్:
ఒకవైపు ట్రంప్ టారిఫ్ భయాలతో మార్కెట్లు విలవిలలాడుతుంటే.. యూఎస్ ఎకానమీ స్లో డౌన్ అవుతుందనే వార్త మార్కెట్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. యూఎస్ 4వ క్వార్టర్ ఎకానమిక్ డాటా ఇక నుంచి కన్జంప్షన్ తగ్గుతుందనే ఇండికేషన్ ఇవ్వడం మార్కెట్లో భయాలకు కారణం. యూఎస్ ఫోర్త్ క్వార్టర్ జీడీపీ (Q4 US GDP) 2.3 శాతంగా నమోదైంది.
ట్రంప్ టారిఫ్ భయాలు:
అదే విధంగా మార్చి 4 నుంచి మెక్సికో, కెనాడా దేశాలపై 25 శాతం, చైనాపై 10 శాతం టారిఫ్ అమలవుతుందని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించడంతో ప్రపంచ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. యూఎస్ మార్కెట్లు కూడా పతనం అంచుల్లోనే ఉన్నాయి. ఈ ప్రభావం ఇండియన్ మార్కెట్లపై తీవ్రంగా పడిందని చెప్పవచ్చు.
FIIల అమ్మకాలు:
ఇండియన్ మార్కెట్ నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరుపుతున్నారు. ఒక్క ఫిబ్రవరి నెలలో రూ.46 వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపారు. జనవరి, ఫిబ్రవరి కలిపి 2025లో మొత్తం రూ.లక్షా 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఇండియన్ మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. దీంతో ఇండియన్ మార్కెట్లలో ఘోరమైన సెల్ ఆఫ్ కొనసాగుతోంది.
స్మాల్, మిడ్ క్యాప్ క్రాష్:
ఇండియన్ మార్కెట్లలో స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు భారీగా పడిపోతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్ల ఫెవరేట్ స్టాక్స్ అయిన స్మాల్, మిడ్ క్యాప్ కంపెనీలు భారీగా పడిపోతుండటంతో భారీ నష్టాలను చవిచూస్తున్నారు. స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్ లు ఓవర్ వ్యాల్యువేషన్ లో ఉండటమే అందుకు కారణం అంటున్నారు ఎనలిస్ట్ లు. అయితే బుల్ మార్కెట్ లో హైయర్ వాల్యువేషన్ లో కూడా FII లు పెట్టుబడులు పెడుతుంటారు. బేర్ మార్కెట్లో వ్యాల్యువేషన్ ఒక కన్సర్న్ గా మారటం కామన్ .
మార్చి 4 నుంచి టారిఫ్ లు అమలులోకి వస్తాయని యూఎస్ ప్రసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 27న మరోసారి ఉద్ఘాటించడంతో మార్కెట్లలో అన్ సర్టెనిటీ ఏర్పడింది. దీంతోపాటు డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ఊహించినంగా లేకపోవడంతో రిచ్ వ్యాల్యువేషన్స్ ఉన్నాయని ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మకాలు చేస్తున్నారని ప్రముఖ ఫండ్ మేనేజర్ కునాల్ రాంభియా అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిండా మునిగిన రిటైల్ ఇన్వెస్టర్లు.. ఇప్పుడేం చేయాలి:
కోవిడ్ 19 ఫాల్ తర్వాత మార్కెట్లలో వచ్చిన రికవరీ.. బుల్ మార్కెట్ జోష్ కారణంగా స్టాక్ మార్కెట్లలోకి కొత్త ఇన్వెస్టర్లు ఎక్కువ మంది వచ్చారు. ప్రపంచంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా అంతగా ప్రభావితం కాని లార్జ్ క్యాప్ స్టాక్స్ వైపు వెళ్లకుండా.. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయని నమ్మకంతో ఎక్కువగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ వస్తున్నారు. అయితే ఎంత మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయో.. అంతే మల్టీ బ్యాగర్ లాస్ స్మాల్, మిడ్ క్యాప్స్ కంపెనీల్లో ఉంటుంది. ప్రస్తుతం మార్కట్లో అదే చూస్తున్నాం.
ఈ మార్కెట్ క్రాష్ లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 21 శాతం పడగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 16 శాతం ఫాల్ అయ్యింది. దీంతో చిన్న కంపెనీలో 30 శాతం నుంచి 80 శాతానికిపైగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. రిటైల్ ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలు ఘోర నష్టాలకు లోనయ్యాయి.
Also Read:-నష్టాల్లో 83 శాతం చిన్న షేర్లు.. రోజుకు 25 వేల కోట్ల నష్టం..
మొత్తానికి ఈ క్రాష్ లో రిటైల్ ఇన్వెస్టర్లు ఘోర నష్టా్ల్లో కూరుకుపోయారు. అయితే ఇప్పుడేంచేయాలి అనేది ప్రశ్న. 30 నుంచి 80 శాతం నష్టాల్లో ఉన్న రీటైల్ ఇన్వెస్టర్లు ఫియర్ తో అమ్మేసుకుంటే నష్టపోవడం పక్కా. పోర్ట్ ఫోలియోలో ఉన్న నష్టం ఒరిజినల్ నష్టం కాదని అంటున్నారు. ఎందుకంటే మళ్లీ రికవర్ స్టాట్ అయితే పెట్టిన డబ్బు మళ్లీ రిటన్ వస్తుందని, భయంతో ఇంత నష్టాల్లో అమ్మేసుకోవడం కరెక్ట్ కాదని చెబుతున్నారు. ఒకవేళ పోర్ట్ ఫోలియో ఇంకా నష్టాలకు లోను కాకుండా లభాల్లో ఉంటే తక్షణ అవసరాల కోసం అమ్మేసుకుని.. మార్కెట్ రివర్స్ స్టాట్ అయ్యిందనే కన్ఫామ్ అయ్యాక మళ్లీ కొనొచ్చునని ఎనలిస్టులు చెబుతున్నారు.
అదే విధంగా ఈ టైమ్ లో యావరేజ్ చేయడం, ఫ్రెష్ బయ్యింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా మార్కెట్ ఎంత వరకు పడుతుందో క్లారిటీ లేదు. 21, 300 వరకు నిఫ్టీ ఫాల్ ఉండవచ్చని అంటున్నారు. కాబట్టి మార్కెట్ రివర్సల్ కన్ఫామ్ అయ్యే వరకు వేచి చూడటం బెటర్. మార్కెట్ కాస్త కన్సాలిడేషన్ ఫేజ్ ను గమనించి పెట్టుబడి పెట్టవచ్చు. అంతేకాని పడిపోతుంది కదా.. ఆవేశంతో పెట్టుబడులు పెట్టడం కరెక్ట్ కాదు అని చెబుతున్నారు.