భారత దేశంలో హోలీ పండుగ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ రోజు చాలా కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంటుంది. అయితే హోయి పండుగ రోజు సోమవారం (మార్చి 25)న భారతదేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఆరు హత్యలు వెలుగుచూశాయి. ఢిల్లీ పోలీసులు కొంచెం ఆలస్యంగా బుధవారం ఆ కేసుల వివరాలు తెలిపారు. అలీపూర్ లో ఓ మహిళ గొంతు కోసి హత్య చేయబడింది. దీంతోపాటు నార్త్ ఢిల్లీలోని గులాబ్ బాగ్ ప్రాంతంలో మత్తుపదార్థాలు విక్రయిస్తు్న్న ఘటనలో డ్రైవర్, ఓ యువకుడికి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఇరువురు వారి వర్గాలను పిలిపించుకొని ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో డ్రైవర్ తమ్ముడు కమిల్ చనిపోయాడు.
Also Read: ఆదర్శం... అద్భుతం... సెవెన్ సిస్టర్స్..
అలాగే నార్త్ ఢిల్లీ శాస్త్రీ పార్క్ దగ్గర 22ఏళ్ల ఓ యువకుడుపై దాడి జరిగింది. ఈ దాడిలో యువకుడు మరణించాడు. ఢిల్లీలోని మంగల్ పూరి ఏరియాలో ఆస్తి తగాదా కారణంగా ఓ వ్యక్తి తన తల్లి, సోదరిని చంపేశాడు. షహదారాలో ఇద్దరు దొంగలు రాజ్ కరణ్ అనే వ్యక్తి ఫొన్ చోరీ చేయడానికి ప్రయత్నించారు. అందుకు అడ్డొచ్చిన రాజ్ కరణ్ ను దుండగులు చంపేశారు. మరో కేసులో ఢిల్లీలోని రాజ్‌పార్క్‌లో ఓ మహిళ హత్యకు గురైంది. మంగళవారం ఉదయం మంగోల్‌పురిలో రైలు పట్టాల దగ్గర మృతదేహం పడి ఉండటంతో అప్రమత్తమైనట్లు పోలీసులు తెలిపారు.