స్టెలింగ్ టూల్స్ వాడుతుంటే ..రకరకాల హెయిర్ స్టైల్స్ కోసం బ్లో డ్రయ్యర్, స్ట్రయిట్ నర్, కర్లర్ లాంటివి వాడుతుంటారు అమ్మాయిలు... అయితే వీటిని సరైన పద్ధతిలో వాడకపోతే జుట్టు చిట్లడం, పొడిబారడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. కొంత మంది జుట్టు తడిగా ఉన్నప్పుడే బ్లో డ్రయ్యర్ వాడుతుంటారు.
Also Read :- నలుగు పిండిని ఇలా తయారు చేసుకోవాలి
కానీ కొంత గాలికి జుట్టుని ఆరనిచ్చాకే దీన్ని వాడాలి. దీనివల్ల జుట్టుపై వేడి ప్రభావం అంతగా ఉండదు. అలాగే స్ట్రైట్ నర్, కర్లర్ ఉపయోగించే ముందు తప్పనిసరిగా కండీషనర్, హెయిర్ ప్రొటక్షన్ సిరమ్ లను ఉపయోగించాలి. అలాగే ప్రత్యేక వేడుకలున్నప్పుడు కొత్త ఉత్పత్తులకు, రకరకాల డైలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని సందర్భాల్లో అవి పడకపోవడం వల్ల జుట్టు ఊడిపోతుంది.
–వెలుగు, లైఫ్–