తమ పేరు, చిరునామా, ఐరిస్, వేలిముద్రలు వంటి పర్సనల్ డేటాతో ఉండే కార్డే ఆధార్ కార్డ్. ఇండియాలో ఆధార్ అంటే తెలియని వారెవరు ఉండరు. ఇది ఐడెంటిటీ.. మరి మీలో ఎంతమందికి బ్లూ ఆధార్ తెలుసు? కచ్చితంగా చాలామందికి బ్లూ ఆధార్ గురించి తెలిసిఉండదు. ఈ ప్రశ్న వినగానే నోర్లు వెల్లబెడతారు. బ్లూ ఆధార్ అంటే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న చిన్న పిల్లలకు ఉంటుంది. దీన్నే బాల ఆధార్ అని కూడా అంటారు. UIDAI అధికారిక వెబ్ సైట్ లో బ్లూ ఆధార్ కు అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ రిజిస్టేషన్ లింక్ పై క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు తెలపాలి.
బాబు లేదా పాప పేరు, తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నెంబర్స్, ఈ మెయిల్ లాంటి డీటేల్స్ ఫిల్ చేయాలి. ఇందుకు అడ్రస్, ఫొటోగ్రాఫ్ అవసరం ఉంటుంది. 5 ఏళ్ల వచ్చేంత వరకు పిల్లల వేలిముద్రలు, ఐరిస్ తీసుకోరు. ఇవి బాల ఆధార్ దరఖాస్తు చేసుకోవడానికి అవసరం లేదు. ఇన్ఫర్మేషన్ నింపిన తర్వాత అపాయిట్మెంట్ ట్యాబ్ ఫిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర్లోని ఆధార్ సెంటర్ ను సెలక్ట్ చేసుకొని అక్కడికి వెళ్లి మిగిలిన ప్రాసెస్ పూర్తి చేసి బాల ఆధార్ కు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 60రోజుల్లో ఇది మంజూరు అవుతుంది. పిల్లలకు 5 సంవత్సరాలు నిండిన తర్వాత అదే ఆధార్ కు వేలిముద్రలు, ఐరిస్ లింక్ చేస్తారు.