'బ్లూ బెల్ విన్' లేదా 'బటర్ ఫ్లై పీ' అని పిలిచే పూల మొక్కల నుంచి తయారు చేసే 'బ్లూ టీ' ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆగ్నేయాసియా దేశాల్లో ఎక్కువగా దొరికే ఈ పూల మొక్కలు నీలి రంగులో ఉంటాయి. వీటి నుంచి తయారు చేసే టీ నీలి రంగులో ఉంటూ ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీలో కెఫైన్ ఉండదు.
రోజూ కనీసం రెండు సార్లు ఈ టీ తాగితే క్యాలరీలు కరిగిపోతాయి. అదనపు కొవ్వు తగ్గిపోతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు. మెటబాలిజం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒంట్లోని మలినాల్ని తొలగిస్తాయి. మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గడంలోనూ ఉపయోగపడుతుంది.
చర్మం కాంతిని మెరుగుపర్చేందుకు సహాయపడుతుంది. ఎక్కువ వయసు వారిలా కనిపించకుండా చేస్తుంది. ఈ టీలో లెమన్ జ్యూస్ కలుపుకుంటే మరింత రుచిగా ఉంటుంది. గ్రీన్, హెర్బల్ టీలు ఎక్కువగా తాగుతున్న నేటి కాలంలో బ్లూ ఛాయ్ కూడా మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆన్ లైన్ లో ఈ టీని కొనుగోలు చేయొచ్చు.