మార్కెట్లోకి బ్లూ క్లౌడ్ సాఫ్ట్​టెక్​ ఏఐ ప్రొడక్టులు

మార్కెట్లోకి బ్లూ క్లౌడ్ సాఫ్ట్​టెక్​ ఏఐ ప్రొడక్టులు

హైదరాబాద్, వెలుగు: ఐటీ సేవలు అందించే హైదరాబాద్​ కంపెనీ బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌‌‌‌టెక్ నాలుగు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ (ఏఐ)- ఆధారిత ప్రొడక్టులు -బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా , ఎడ్యు జెనీ,  బస్టర్​లను సోమవారం భారతీయ మార్కెట్లో విడుదల చేసింది.  హైదరాబాద్‌‌‌‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, "ఆరోగ్య సంరక్షణలో ఏఐ అంటే టెక్నాలజీ మాత్రమే కాదు..ఇది మన జీవితాలను మార్చడానికి సంబంధించినది కూడా.

ఏఐతో మనం రోగనిర్ధారణ సేవలను పొందవచ్చు. మన శరీరానికి అనువైన చికిత్సను తీసుకోవచ్చు. మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఆరోగ్య సంరక్షణను ప్రతి వ్యక్తికి సమర్ధవంతంగా అందించవచ్చు" అని ఆయన అన్నారు. ఈ ప్రారంభోత్సవంలో అతిథిగా మాజీ స్పెషల్‌‌‌‌ చీఫ్‌‌‌‌ సెక్రటరీ అజయ్‌‌‌‌ మిశ్రా, బీసీఎస్​ చైర్మన్ జానకి యార్లగడ్డ పాల్గొన్నారు.