నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్​కీలకం : సీపీ అంబర్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా 

నేరాల నియంత్రణలో బ్లూకోల్ట్స్​కీలకం : సీపీ అంబర్ కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా 

గోదావరిఖని, వెలుగు: నేరాల నియంత్రణలో ప్రజలకు మొదటగా అందుబాటులో ఉండే బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బంది పాత్ర కీలకమని రామగుండం సీపీ అంబర్​కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా అన్నారు. బుధవారం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిధిలో జరిగే ప్రతి విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. విధి నిర్వహణలో అలసత్వంగా ఉండొద్దని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ వర్టికల్స్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జులు, సిబ్బంది పాల్గొన్నారు.