తెలుగు రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతుంది. చాలా కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకోగా.. కొన్ని ప్రాంతాల్లో ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. అయితే శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు .
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం పాత మేఘవరం – డి మరువాడ సముద్ర తీరాల మధ్య భారీ నీలి తిమింగలం ఒడ్డుకు కొట్టుకవచ్చింది. సుమారు 25 అడుగుల పొడవు , ఐదు టన్నుల వరకు బరువు ఉంటుంది. దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. దీనిని చూడటానికి వచ్చినవారు సెల్ఫీలు దిగుతూ హడావిడి చేస్తున్నారు.
సముద్ర తీరంలో అరుదైన చేపలు, భారీ తిమింగలలు అప్పుడప్పుడు కొట్టుకవస్తుంటాయి. ఇలాంటివి అరుదుగా వస్తుండడం తో జాలర్లు , చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి చూస్తుంటారు. తాజాగా నీలి రంగులో ఉన్న భారీ తిమింగలం ఒడ్డుకు కొట్టుకవచ్చింది. అయితే ఈ తిమింగలం చనిపోయింది. ఈ నీలి తిమంగలాన్ని బ్లూ వేల్ అంటారని మత్స్యకారులు చెబుతున్నారు. భారీ పరిమాణంతో చూడటానికి వింత జీవిలా ఉండటంతో.. దీనిని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో జనాలు తరలి వస్తున్నారు. తిమంగలాన్ని పట్టుకొని యువత సెల్ఫీ లు తీసుకుంటున్నారు. ఇంతవరకు ఇలాంటి తిమంగలాన్ని చూడలేదని వారు చెపుతున్నారు. సముద్రం లోపల ఇలాంటివి ఉంటాయని వినడమే తప్ప చూడలేదని అంటున్నారు.
నీలిరంగుతో ఆహ్లాదకరంగా కనిపించే సముద్రం అల్పపీడన ప్రభావంతో గత వారం రోజులుగా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దీంతో నీలి తిమింగలం చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు. ఈ తిమింగలం బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని.. లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండొచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. అయితే అత్యంత భారీగా ఉండే జాతులలో ఇది కూడా ఒకటి అంటున్నారు. సుమారుగా 5 టన్నులు ఉండడంతో ఇది పిల్ల తిమింగలంగా అనుమానిస్తున్నారు. స్థానికులు, మత్స్యశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగలం (బ్లూ వేల్) కొట్టుకొచ్చింది
— Telugu Scribe (@TeluguScribe) July 28, 2023
సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది. అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు… pic.twitter.com/XRG3h8n4mc