అమెరికాలో గత మార్చిలో ఓ ఇండియన్ స్టూడెంట్ చనిపోయాడు..అతను ఆత్మహత్య చేసుకున్నట్లు అక్కడి పోలీసులు నిర్ధారించారు. అయితే అతడు బలవంతంగా ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏం వచ్చిందని విచారణ చేస్తే..అతని ప్రాణాలు తీసింది ఓ ఆన్ లైన్ గేమ్ అని తేలింది. అదే బ్లూ వేల్ ఛాలెంజ్ అని పిలువ బడే ఆన్ లైన్ డేర్స్ గేమ్ ఆడుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
బ్లూవేల్ గేమ్ ఛాలెంజ్ అంటే ఏమిటీ ..
బ్లూవేల్ గేమ్ ఛాలెంజ్ గేమ్ ను సూసైడ్ గేమ్ అని కూడా పిలుస్తారు. దీనిని రష్యాకు చెందిన నేరస్థుడు పిలిప్స్ బెడీకిన్ 2013లో క్రియేట్ చేశాడు. ఈ గేమ్ వల్ల ఇండి యా, యూఎస్, చైనా తోపాటు ఇతర దేశాల్లో 130 మంది బాలబాలికల ప్రాణాలు బలిగొంది. ఈ ఆన్ లైన్ ఛాలెంజ్ గేమ్ ఆటగాళ్లను 50 రోజులలోపు ఆత్మహత్యకు చేసు కునేలా ఒత్తిడి చేస్తుంది. ప్రతి రోజు ఏదో ఒక ధైర్య సాహసాన్ని ప్రదర్శించాలి .. వాటిని చిత్రీకరించాలి. ఇటువంటివి హారర్ సినిమాల్లో చాలా ఈజీగా చేస్తుంటారు. కానీ ఇవి ఆత్మహత్యలను ప్రేరేపిస్తాయి కూడా.
మొదట్లో సులభమైన టాస్క్ లను ఇస్తారు. అది వ్యసనంగా మారిపోతుంది. ఇలా 50 రోజుల్లో మానసిక స్థితి మారిపోతుంది. గేమ్ ఆడేవారు స్వతహాగా ప్రాణాలు తీసుకునే స్థాయికి ప్రేరేపించబడతారు.
దుర్భలమైన మానసిక స్థితి గల ప్లేయర్లను ఎంచుకోవడం ద్వారా ఈ గేమ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో క్యూరేటర్లు ఇలాంటి ప్లేయర్లను ఎంచుకుంటారు.
16 మంది యువకుల ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలతో ఈ గేమ్ సృష్టికర్త బుడెకిన్ ను అరెస్ట్ చేశారు. అతను నేరాన్ని అంగీకరించాడు. బుడెకిన్ ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.