బ్లూస్టార్​ నుంచి 150 ఏసీ మోడల్స్​

బ్లూస్టార్​ నుంచి 150 ఏసీ మోడల్స్​
  • శ్రీసిటీ ప్లాంటు విస్తరణకు రూ.100 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:  బ్లూ స్టార్ తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి 150 రూమ్ ఏసీల మోడల్స్​ను తీసుకొచ్చింది. ఈ లైనప్‌‌లో ఇన్వర్టర్, ఫిక్స్‌‌డ్ స్పీడ్,  విండో ఏసీలు ఉన్నాయి. ఇవి 0.8 టన్నుల నుంచి 4 టన్నుల వరకు కెసాసిటీల్లో లభిస్తాయి. ధరలు రూ.29 వేల నుంచి మొదలవుతాయి.   హైదరాబాద్​లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్లూ స్టార్ ఎండీ త్యాగరాజన్ మాట్లాడుతూ ‘‘మాకు ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా శ్రీసిటీలో ప్లాంటు ఉంది. 

దానిని విస్తరించడానికి రూ.100 కోట్లు ఖర్చు చేస్తాం. ఆర్​అండ్​ డీ కోసం మరో రూ.51 కోట్లు ఖర్చు పెడతాం.  మా మార్కెట్​వాటా ప్రస్తుతం 13 శాతం వరకు ఉంది. 2026 నాటికి దీనిని 14.3 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం 2,100 కి పైగా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. వీటి సంఖ్యనూ పెంచుతాం.

తెలుగు రాష్ట్రాల్లో 4,500 ఔట్​లెట్లు ఉన్నాయి. దాదాపు 15 శాతం మార్కెట్​షేర్​ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 15 లక్షల ఏసీలు అమ్ముతామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18 లక్షల యూనిట్లు అమ్ముతామని భావిస్తున్నాం”అని ఆయన వివరించారు.