- కార్మికులను మోసగిస్తున్న యాజమాన్యం
- బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్ సత్తయ్య
కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి యాజమాన్యం కార్మికులకు ప్రకటించిన లాభాల వాటాలో మోసం జరిగిందని బీఎంఎస్ స్టేట్ప్రెసిడెంట్యాదగిరి సత్తయ్య ఆరోపించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023– -24 ఆర్థిక సంవత్సరానికి సంస్థ రూ.37వేల కోట్ల టర్నోవర్సాధించిందని యాజమాన్యం ప్రకటించిందన్నారు.
సింగరేణి రూ.4,701 కోట్లపైగా లాభాలు సాధించగా.. అందులో 33 శాతం వాటాగా కార్మికులకు రూ.1,551.33 కోట్లు ఇవ్వాల్సింది పోయి రూ.796 కోట్లు ఇస్తూ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్ర సర్కార్‌కు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు వత్తాసు పలుకుతున్నాయన్నారు. సింగరేణి యాజమాన్యం వాస్తవ నికర లాభాలపై శ్వేతపత్రం రిలీజ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ఏరియా బీఎంఎస్ వైస్ప్రెసిడెంట్నాతాడి శ్రీధర్‌రెడ్డి, లీడర్లు రాగం రాజేందర్, పురుషోత్తంచారి, గూడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.