కోల్బెల్ట్, వెలుగు: సింగరేణిలో బీఎంఎస్ను గెలిపిస్తే కోల్ ఇండియా ఒప్పందాల అమలుకు కృషి చేస్తామని బీఎంఎస్ స్టేట్ ప్రెసిడెంట్, స్టాండర్డైజేషన్ కమిటీ మెంబర్ యాదగిరి సత్తయ్య అన్నారు. మంగళవారం మందమర్రి ఏరియా కాసీపేట-1 గనిపై నిర్వహించిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. బొగ్గు గని కార్మికులకు మెరుగైన వేతన ఒప్పందాలు, ప్రమోషన్ పాలసీలు, అలవెన్సులపై ఆదాయ పన్ను రియింబర్స్మెంట్ కల్పిస్తామన్నారు.
కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన విద్య, కార్పొరేట్ వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సింగరేణికి రావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలను సంస్థకు చెల్లించే విధంగా, కొత్త బొగ్గు గనులు ప్రారంభించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బీఎంఎస్పనిచేస్తుందని వెల్లడించారు. బీఎంఎస్ ఏరియా కార్యదర్శి గుర్రం ప్రదీప్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ డొనికేన రమేశ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు లగిసెట్టి కమలాకర్, కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ పాల్గొన్నారు.