నడి రోడ్డుపై తగలబడిన లగ్జరీ బీఎండబ్ల్యూ కారు

నడి రోడ్డుపై తగలబడిన లగ్జరీ బీఎండబ్ల్యూ  కారు

 తమిళనాడులోని  చెన్నైలో  నడీ రోడ్డుపై బీఎండబ్ల్యూ కారు మంటల్లో కాలిపోయింది. చెన్నైలోని క్రోంపేటలో   రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో బీఎండబ్ల్యూ   కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే  కారు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

BMW car caught fire at Chrompet, Chennai.

A moving high-end car (BMW GT) caught fire in the middle of a busy road near Chrompet in Chennai.#CHENNAI #BMWCAR #BMWGT #CHROMPET pic.twitter.com/y3gq5uufsE

— Nitesh rathore (@niteshr813) July 25, 2023

అరుణ్ బాలాజీ అనే వ్యక్తి  బీఎండబ్ల్యూ కారులో  తిరువల్లికేణి నుంచి డిండివనం వెళుతుండగా క్రోంపేటల దగ్గరకు రాగానే  కారులో మంటలు చెలరేగాయి.   డ్రైవర్ పార్థసారథి కారులో మంటలు చెలరేగడాన్ని గమనించి వెంటనే  కారు ఆపి దూకారు. క్షణాల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న  ఫైర్  సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.  కానీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది.  ఈ ఘటనతో  రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.