
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద శనివారం తెల్లవారుజామున బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్‌తో అదుపుతప్పి ట్రాఫిక్ పోలీసు దిమ్మెల్ని ఢీకొట్టింది. దాంతో కారు టైర్లు పేలి, ఆయిల్ట్యాంకర్పగిలిపోయింది. ఎయిర్ బెలూన్స్ఓపెన్ కావడంతో కారు డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది.
అనంతరం కారును అతడు అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. టీఎస్09 ఎఫ్వై 9990 నంబరుతో ఉన్న కారు మాలిక్జెమ్స్అండ్జువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.