![ORRపై.. నుజ్జు నుజ్జు అయిన BMW కారు.. స్టీరింగ్ సీట్లో ఇరుక్కుపోయిన డ్రైవర్](https://static.v6velugu.com/uploads/2025/02/bmw-car-hit-to-trally-auto-in--sangareddy-orr_PasIqXJbjZ.jpg)
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన యాక్సిడెంట్ షాకింగ్ కు గురి చేస్తుంది. పఠాన్ చెరు మండలం పాటి గ్రామం దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. కొల్లూరు నుంచి పటాన్ చెరు వెళుతున్న BMW కారు.. ముందు వెళుతున్న ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో BMW కారు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయ్యింది. టైర్లు ఊడిపోయాయి. ఇంజన్ తప్పితే.. మిగతా భాగం అంతా లేచిపోయింది.
కారు డ్రైవర్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. బెలూన్స్ ఓపెన్ అవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని బయటకు తీశారు. కాసేపు నరకయాతన అనుభవించాడు. తీవ్ర గాయాలైన అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంతో ఘటనా స్థలం వద్ద కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఈ మధ్య ఔటర్ రింగ్ రోడ్డుపై తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అతి వేగంతో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి.