BMW బైక్.. కొత్త రంగుల్లో.. వారేవా సూపర్

BMW బైక్.. కొత్త రంగుల్లో.. వారేవా సూపర్

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసిన కొత్త బైక్స్ ఆకట్టుకుంటున్నాయి. బీఎండబ్ల్యూ జీ 310 సిరీస్ లో భాగంగా విడుదల చేసిన మూడు మోడల్స్ కు..  సరికొత్త కలర్ ఆప్షన్స్ ను పరిచయం చేసింది.  బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ జీ 310 జీఎస్ బైకులు భారత మార్కెట్లోకి కొత్త రంగులతో మరింత కొత్తగా లాంఛ్ అయ్యాయి. ఈ కొత్త రంగుల్లో ఉన్న బీఎండబ్ల్యూ జీ సిరీస్ బైకులు వినయోగదారులను ఆకట్టుకుంటున్నాయి. 

BMW G 310 R ..

BMW G 310 R ఇప్పుడు కొత్త స్టైల్ స్పోర్ట్, స్టైల్ ప్యాషన్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది.  రేసింగ్ బ్లూ మెటాలిక్/పోలార్ వైట్‌లోని స్టైల్ స్పోర్ట్ పెయింట్‌వర్క్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. అద్భుతమైన పెయింట్‌వర్క్  బైక్ దూకుడును ప్రతిబింబిస్తుంది. ఈ బైక్ పై  ప్రతి రైడ్‌ థ్రిల్లింగ్ అడ్వెంచర్‌గా భావించొచ్చు. గ్రానైట్ గ్రే మెటాలిక్ పెయింట్‌వర్క్‌తో కూడా బైక్ కిర్రాక్ గా ఉంది. 

BMW G 310 RR

BMW G 310 RR దాని కొత్త కాస్మిక్ బ్లాక్ 2 పెయింట్  ప్రత్యేకంగా నిలుస్తుంది.  ఇది డైనమిక్ లుక్ తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. సొగసైన పెయింట్‌వర్క్ బైక్  స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.  రహదారిపై పరిగెడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవు. 

BMW G 310 GS

కొత్త BMW G310 GS  రేసింగ్ రెడ్‌లో  స్టైల్ ర్యాలీ పెయింట్‌వర్క్‌తో  అందుబాటులోకి వచ్చింది. ఈ  పెయింట్‌వర్క్ బైక్ ను డ్రైవ్ చేయాలన్న ఉత్సాహాన్ని మరింత పెంచుతుంది. అంతే కాకుండా బైక్  సాహసోపేత స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.