
- జూన్ నుంచి అమలు.. బోర్డ్ ఆఫ్ సీఈల భేటీలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: ప్రాజెక్టులకు సంబంధించిన టెస్టులు, సర్వేలు, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ ఇకపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సొంతంగా చేసు కోనున్నది. జూన్ నుంచి డిపార్ట్మెంట్లోని నిపుణులైన అధికారులతోనే వాటిని నిర్వహించేందుకు ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం జలసౌధలో నిర్వహించిన బోర్డ్ ఆఫ్ సీఈ (బీవోసీ) మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నది.
మీటింగ్‌లో 11 అంశాలపై చర్చించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో కచ్చితత్వం, విశ్వసనీయతను పెంచడంలో భాగంగా ఈ సర్వే టూల్స్‌ను వినియోగించుకుంటూఇరిగేషన్ అధికారులే సర్వే ఇన్వెస్టిగేషన్స్‌ను చేయాలని నిర్ణయించారు. అయితే, ఆర్ అండ్ బీ, సర్వే విభాగాల్లో స్టాఫ్ కొరత ఉన్న నేపథ్యంలో తాము చేయలేమని ఆయా విభాగాల సీఈలు మీటింగ్‌లో తెలిపారు.
మరోవైపు ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాల్లో నాణ్యత పెంచేందుకు క్వాలిటీ మేనేజ్మెంట్, క్వాలిటీ అష్యూరెన్స్లను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన హైడ్రాలజీ, హైడ్రాలిక్స్ (గేట్లు), ప్రాజెక్ట్ అలైన్మెంట్లపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోనున్నారు.