
ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 5 నుంచి జరిగే ఇంటర్మీడియేట్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను పకడ్బందీగా నిర్వహించాలని బోర్డ్ ఆఫీసర్ సీహెచ్.యాదగిరి అధికారులకు తెలిపారు. శుక్రవారం ఐడీవోసీ లో ఎగ్జామ్స్ నిర్వహణపై ఇంటర్ జిల్లా విద్యాధికారి కె.రవిబాబు అధ్యక్షతన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా యాదగిరి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
రవిబాబు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు, అక్కడి నుంచి పోస్టాఫీస్ సెంటర్లకు పరీక్ష పేపర్లను భద్రత మధ్య సరఫరా చేయాలన్నారు. ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్ ఫోన్లకు అనుమతి లేకుండా, స్టూడెంట్స్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో డీఈసీ సభ్యులు కుతుంబకా శ్రీనివాసరావు, సింహాచలం, వీరభద్రరావు, హైపవర్ కమిటీగా విజయకుమారి, శంకర్ పాల్గొన్నారు.