
న్యూఢిల్లీ: స్మార్ట్‌వాచీల వంటి వేరబుల్స్ తయారు చేసే బ్రాండ్ బోట్ పేరెంట్కంపెనీ ఇమాజిన్ మార్కెటింగ్, రహస్య ప్రీ-ఫైలింగ్ మార్గం ద్వారా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి డ్రాఫ్ట్ పత్రాలను అందజేసింది. పబ్లిక్‌కు వెళ్లడానికి కంపెనీకి ఇది రెండో ప్రయత్నం. ఇంతకుముందు కంపెనీ రూ. రెండు కోట్ల ఐపీఓని మొదలుపెట్టడానికి జనవరి 2022లో డ్రాఫ్ట్ అందజేసింది. ఇందులో రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, రూ. 1,100 కోట్ల వరకు ఆఫర్ఫర్సేల్(ఓఎఫ్ఎస్) ఉంటుంది. అమన్ గుప్తా, సమీర్ మెహతా 2013లో స్థాపించిన ఇమాజిన్ మార్కెటింగ్ ఆడియో గేర్, స్మార్ట్ వేరబుల్స్, పర్సనల్ గ్రూమింగ్ ఉత్పత్తులు, మొబైల్ యాక్సెసరీలను తయారు చేస్తుంది.
టాటా గ్రూప్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ టాటా క్యాపిటల్, ఎడ్‌టెక్ యునికార్న్ ఫిజిక్స్‌వాలా కూడా రహస్య ఫైలింగ్ మార్గాన్ని ఎంచుకున్నాయి. ఈ విధానంలో, కంపెనీ తన డీఆర్‌హెచ్‌పీ ని సెబీకి అందజేసినప్పటికీ, దానిలోని వివరాలను కొంతకాలం పాటు బయటపెట్టదు. దీని వలన కంపెనీకి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు కంపెనీ తన వ్యాపార రహస్యాలను, పోటీదారులకు తెలియకుండా కాపాడుకోవచ్చు. 2024లో ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ, విశాల్ మెగా మార్ట్ రహస్య ఫైలింగ్‌లు చేసిన తర్వాతే ఐపీఓలకు వచ్చాయి.