
పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్లోని పేషెంట్ సహాయకుల విశ్రాంతి కేంద్రంలో ఉచిత భోజనం సరఫరా కోసం జనహిత సేవా ట్రస్ట్ కు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలక్ట్రిక్ ఆటో వ్యాన్ ను విరాళంగా ఇచ్చింది. సోమవారం బ్యాంక్జీఎం, జోనల్ హెడ్ రితేష్ కుమార్, హైదరాబాద్జోన్ డీజీఎం సుధాకర్, మెట్రో రీజియన్ డీజీఎం కె.ఆదిత్య జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీలు నర్సింహమూర్తి, పాలపర్తి రమేశ్ కు వ్యాన్ తాళాలు అందజేశారు. సీఎస్ఆర్లో భాగంగా రూ.ఐదు లక్షలతో ఆటో కొని అందజేసినట్టు చెప్పారు. గాంధీలో అటెండెంట్లకు ఉచిత భోజనం సమకూర్చడానికి రూ.55 వేల చెక్కు అందజేశారు.